అతి చిన్న వయస్సులోనే మీరు పెట్టుబడి పెట్టడం ఎందుకు ఆరంభించాలి?

అతి చిన్న వయస్సులోనే మీరు పెట్టుబడి పెట్టడం ఎందుకు ఆరంభించాలి? zoom-icon

మ్యచువల్ ఫంఢ్స్ సరైనవా?

లత మరియు నేహా, ఇద్దరూ స్నేహితులు. వారు వివిధ వయస్సుల వద్ద మ్యూచువల్ ఫండ్స్ؚలో పెట్టుబడి పెట్టడం ఆరంభించారు. లతకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, తను ప్రతి నెలా రూ.5000లతో పెట్టుబడి పెట్టడం ఆరంభించింది. 35 సంవత్సరాల వయస్సులో నేహా కూడా అదే పని చేసింది. సగటు వార్షిక వడ్డీ 12% అనుకుంటే, 60 సంవత్సరాల వయస్సులో వారి పెట్టుబడి పోర్ట్ ఫోలియోలు ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం:

  • 60 సంవత్సరాల వయస్సు నాటికి, లత పెట్టుబడి పోర్ట్ఫోలియోలో పెట్టుబడి చేసిన మొత్తం రూ.21 లక్షలు కాగా, తన పోర్ట్ؚఫోలియో విలువ రూ.3.22 కోట్లు ఉంటుంది
  • 60 సంవత్సరాల వయస్సు నాటికి, నేహా పెట్టుబడి పోర్ట్ఫోలియోలో పెట్టుబడి చేసిన మొత్తం రూ.15 లక్షలు కాగా, తన పోర్ట్ఫోలియో విలువ రూ.93.94 లక్షలు ఉంటుంది.

ఇక్కడ, నేహా కన్నా లత త్వరగా పెట్టుబడి చేయడం ఆరంభించడం వలన, లత పోర్ట్ఫోలియో గణనీయంగా పెరిగింది. త్వరగా పెట్టుబడి పెట్టడం వలన ప్రయోజనం ఏంటంటే, సంవత్సరాలు గడిచే కొద్దీ అది పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అందిస్తుంది మరియు మీ పెట్టుబడుల మీద రాబడులు పెరిగే అవకాశాన్ని అందిస్తుంది.

ఈ కథనంలో పేర్కొన్న గణాంకాలు కేవలం ఉదాహరణ ప్రయోజనాలకు మాత్రమే.

ఆదా చేయడం మరియు పెట్టుబడులు పెట్టడం యొక్క ప్రాముఖ్యత

ప్రతి వ్యక్తి తన ఆర్ధిక లక్ష్యాలను సాధించి, తన భవిష్య భద్రతను నిర్ధారించుకోవడంలో సహాయపడగల సామర్ధ్యం, ఆదా మరియు పెట్టుబడుల ఆర్ధిక సంబంధిత ఆచరణలకు ఉంటుంది.

అత్యవసర పరిస్థితులు మరియు ఊహించని ఖర్చుల కొరకు నిధులు సమకూర్చుకోవడంలో ఆదా చేయడం సహాయపడుతుంది. మరో వైపు, మీ డబ్బును సరైన విధంగా పెట్టుబడి పెట్టడం వలన కాలం గడిచే కొద్దీ రాబడిని అందుకోగలరు. ఇది సంపదను నిర్మించుకోవడానికి, దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడగలదు.

ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం ద్వారా పటిష్ఠమైన ఆర్ధిక పునాదిని నిర్మించుకుని, మీ సంపదను సమర్ధవంతంగా నిర్వహించుకోగలుగుతారు మరియు సౌకర్యవంతమైన, భద్రతతో కూడిన భవిష్యత్తును ఖచ్చితంగా పొందగలరు. మున్ముందు గరిష్ఠ ప్రయోజనాలను పొందేందుకు ఈ అలవాట్లను యుక్త వయసులోనే ఆరంభించి, క్రమశిక్షణతో నిలకడగా ఉండడం ఎంతో ముఖ్యం. 

 

యుక్త వయసులో  పెట్టుబడులు పెట్టడం వలన కలిగే ఐదు ప్రయోజనాలు

యుక్త వయసులో పెట్టుబడులు పెట్టడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మీరు పెట్టుబడులు పెట్టడం వెంటనే ఎందుకు ఆరంభించాలో తెలిపే ప్రధానమైన ఐదు కారణాలు ఇవి:

  1. పవర్ ఆఫ్ కాంపౌండింగ్

మీరు ఎంత త్వరగా ఆరంభిస్తే, అంత దీర్ఘకాలం పాటు మీ పెట్టుబడులు పెరిగి, కాంపౌండ్ అయ్యే అవకాశం ఉంటుంది. పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటే మీ రాబడులు మరిన్ని రాబడులను సృష్టిస్తాయి, కాలక్రమేణా చిన్న పెట్టుబడులు సైతం మరింత ఎక్కువగా పెరుగుతాయి. . ఉదాహరణకు, మీరు 30 సంవత్సరాల పాటూ 12% వార్షిక వడ్డీ చొప్పువ రూ.500 పెట్టుబడి చేయడం ఆరంభిస్తే, రూ.17.47లక్షల మూలధనాన్ని మీరు పొందగలరు.

  1. మార్కెట్ ఒడుదుడుకుల నుండి కోలుకోవడానికి మరింత సమయం

వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టడం వలన మార్కెట్ ఒడిదుడుకుల నుండి లేదా క్షీణించడం నుండి కోలుకునేందుకు మరింత సమయం ఉంటుంది, మీరు మీ ఆర్ధిక లక్ష్యాలను చేరుకోగలుగుతారు. త్వరగా ఆరంభించడం ద్వారా, మీ పెట్టుబడులతో మరిన్ని రిస్కులను తీసుకోగలుగుతారు మరియు మీ పెట్టుబడులు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోతే కోలుకునేందుకు అప్పటికీ సమయం ఉంటుంది.

  1. ఆర్ధిక క్రమశిక్షణను ఏర్పరచుకోవడం

యుక్త వయసులో పెట్టుబడులు పెట్టడానికి ఆర్ధిక క్రమశిక్షణ మరియు మీ పెట్టుబడి పోర్ట్ ఫోలియోకు క్రమం తప్పకుండా కంట్రిబ్యూట్ చేయడం అవసరం. ఈ అలవాటు మెరుగైన ఆర్ధిక అలవాట్లను ఏర్పరచుకోవడంలో మీకు సహాయపడుతుంది మరియు మీ ఆర్ధిక లక్ష్యాలను సాధించడాన్ని సులభతరం చేస్తుంది. ఉదాహరణకు, ప్రతి నెలా SIPలలో చిన్న మొత్తాన్ని పెట్టుబడి చేయడం ద్వారా మీరు మీ పెట్టుబడి అలవాటును ఆటోమేట్ చేయవచ్చు.

  1. మెరుగైన ఆర్ధిక భద్రత

యుక్త వయసులో  పెట్టుబడులు పెట్టడంమీ ఆర్ధిక లక్ష్యాలను సాధించడంలో మరియు మీ భవిష్యత్తును భద్రపరచుకోవడంలో సహాయపడగలదు. యుక్త వయసులో పెట్టుబడులు పెట్టడం ద్వారా, కాలక్రమేణా గణనీయమైన సంపదను మీరు సమకూర్చుకోగలరు, అది మీకు ఆర్ధిక స్థిరత్వాన్ని మరియు మానసిక ప్రశాంతతను అందించగలదు.

  1. కొద్దిపాటి బాధ్యతలతో మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టగలరు

యుక్త వయస్సులోనే పెట్టుబడులు పెట్టడం ఆరంభిస్తే, మీకు బాధ్యతలు పెద్దగా ఉండవు. అంటే పెట్టుబడి పెట్టేందుకు మీరు మరింత డబ్బును కేటాయించవచ్చు. మీ వయసు పెరిగే కొద్దీ, కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య అవసరాలు మొదలైనటువంటి ఆర్ధిక బాధ్యతలు మీకు ఉండవచ్చు. అప్పుడు మీకు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి చేసే అవకాశం ఉండకపోవచ్చు.

పెట్టుబడి పెట్టడం ఎలా ఆరంభించాలి?

 

దీర్ఘకాలంలో సంపదను ఏర్పరచుకోవడానికి మ్యూచువల్ ఫండ్స్ؚలో పెట్టుబడి పెట్టడం అద్భుతమైన మార్గం. భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఆరంభించేందుకు మీరు ఆచరించగల స్టెప్స్ ఇవి:

 

  1. పెట్టుబడి పెట్టడం ఆరంభించడానికి ముందు, మీ పెట్టుబడి లక్ష్యాలను తెలుసుకోవడం ముఖ్యం. ఇది మీరు పెట్టుబడి చేయవలసిన మ్యూచువల్ ఫండ్ రకాన్ని నిర్ణయించుకోవడంలో మీకు సహాయపడగలదు.
  2. మీ పెట్టుబడి లక్ష్యాలు మీకు తెలిస్తే, మీ అవసరాలకు సరిపోయే మ్యూచువల్ ఫండ్ మీరు ఎంచుకోవచ్చు. భారతదేశంలో ఎన్నో మ్యూచువల్ ఫండ్ వికల్పాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి, కొంత పరిశోధించి, చక్కటి ట్రాక్ రికార్డ్  కలిగి ఉన్న, మీ పెట్టుబడి లక్ష్యాలకు సరిపోయే ఫండ్ని ఎంచుకోండి. 
  3. మ్యూచువల్ ఫండ్స్ను మదుపరులు క్రమం తప్పకుండా పర్యవేక్షించడం వలన తమ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ గురించి అవగాహన కలిగి ఉండి, తమ పెట్టుబడి వ్యూహానికి సమయానుకూలంగా సర్దుబాట్లు చేసుకోవచ్చు. మదుపరులు తమ ఆర్ధిక లక్ష్యాలు, కాల వ్యవధులకు తగిన విధంగా తమ పెట్టుబడి ఉండేలా నిర్ధారించుకోవడంలో తోడ్పడుతుంది.
  4. తెలివిగా, మీ ఆర్ధిక లక్ష్యాలకు సరిపోయేలా పెట్టుబడి పెట్టడంలో మీకు సహాయపడేందుకు ఒక ఆర్ధిక అనుభవజ్ఞుడిని లేదా నిపుణుడిని సంప్రదించడాన్ని కూడా మీరు ఎంచుకోవచ్చు.

 

సారాంశం

మీరు పెట్టుబడి పెట్టడం ముందుగానే  ప్రారంభిస్తే, మీరు మీ సమయాన్ని  ఆదా చేయవచ్చు అలాగే కాంపౌండింగ్ పవర్ నుండి ప్రయోజనం పొందవచ్చు. ముందస్తు పెట్టుబడి ప్రయోజనాలు మరియు పెట్టుబడిని ఎలా పెట్టాలో ఇప్పుడు మీకు తెలుసు, ఇక వేచి ఉండకండి. ఇప్పుడే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టండి!

డిస్క్లైమర్

మ్యూచువల్ ఫండ్ؚలలోని వివిధ విభాగాల గురించి AMFI వెబ్ؚసైట్ؚలో అందుబాటులో ఉన్న సమాచారం, ఆర్ధిక ఉత్పత్తి విభాగంగా మ్యూచువల్ ఫండ్ؚల గురించి అవగాహనను కలిగించడానికి, కేవలం సమాచార ప్రయోజనానికి మాత్రమే ఉద్దేశించబడింది మరియు అమ్మకాల ప్రచారం లేదా వ్యాపార అభ్యర్ధన కాదు. 

ఇక్కడ ఉన్న కంటెంట్ బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారం, అంతర్గత వనరులు మరియు విశ్వసించదగినదిగా భావించిన ఇతర థర్డ్-పార్టీ వనరుల ఆధారంగా AMFI తయారుచేసింది. అయితే, ఈ సమాచారం ఖచ్చితత్వానికి, సంపూర్ణతకు భరోసాను, లేదా అటువంటి సమాచారం మారకుండా ఉంటుంది అనే హామీని AMFI ఇవ్వదు. 

ఇక్కడ అందించబడిన కంటెంట్ వ్యక్తిగత ఇన్వెస్టర్ల లక్ష్యాలను, రిస్క్ ఎపిటైట్ؚను లేదా ఆర్ధిక అవసరాలను లేదా పరిస్థితులను లేదా ఇక్కడ వివరించిన మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల అనుకూలతను పరిగణలోకి తీసుకోదు. అందువలన, ఈ విషయానికి సంబంధించి పెట్టుబడుల సలహా కోసం ఇన్వెస్టర్లు తమ ప్రొఫెషనల్ ఇన్వెస్ట్మెంట్ సలహాదారు/కన్సల్టెంట్/టాక్స్ సలహాదారును సంప్రదించాలని సూచించబడింది. 

మ్యూచువల్ ఫండ్ స్కీమ్ అనేది డిపాజిట్ ఉత్పత్తి కాదు మరియు మ్యూచువల్ ఫండ్ లేదా దాని AMC యొక్క బాధ్యత కాదు లేదా వారిచే హామీ ఇవ్వబడినది, బీమా చేయబడినది కాదు. అంతర్లీన పెట్టుబడుల స్వభావం కారణంగా, మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తి యొక్క రాబడులు లేదా సంభావ్య రాబడులకు హామీ ఉండదు. ప్రదర్శించబడిన పనితీరు చరిత్ర, పూర్తిగా సూచన ప్రయోజనాలకు మాత్రమే మరియు భవిష్య ఫలితాలకు హామీ కాదు.

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్కులపై ఆధారపడి ఉంటాయి, స్కీముకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ క్షుణ్ణంగా చదవగలరు.

286
పెట్టుబడి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను